ఆర్మీలో అగ్నివీర్ తొలి నోటిఫికేషన్ విడుదల
టి మీడియా, జూన్ 21,న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిషికేషన్ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది.
Also Read : యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి : మంత్రి హరీశ్ రావు
మంగళవారంఎయిర్ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్.. ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అగ్నివీరులు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అగ్నిపత్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube