మార్కెట్లో మాయ గాళ్ళు

-ఫిర్యాదులు,ఉపసంహరణ లు

0
TMedia (Telugu News) :

 

 

CHILLI BAGS IN MARKET
CHILLI BAGS IN MARKET

-రైతులు పేరుతో బైట వారి వ్యవాహారం లు
-సిసిఐ వ్యహారం లో బైటపడ్డ బాగోతం

టీ మీడియా, డిసెంబర్ 8, ఖమ్మం:

సీజన్ ప్రారంభించడానికి ముందు, ఆరంభం అయిన కొద్దిరోజుల వరకువ్యవసాయ మార్కెట్ లో అక్రమాలు, వ్యాపారులు సిండికేట్ ,రైతుల కు అన్యాయం .అధికారులు కు పిర్యాదు, అనంతరం అడ్రెస్ గల్లంతు ఇది నడుస్తున్న తంతు.దీనిపై విస్మయం వ్యక్తం అవుతోంది.రైతులు లేకుండా రైతుల పేరుతో కొంతమంది అలజడి సృష్టించడము లాంటివి ఆర్ధిక ప్రయోజనాలు కోసం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.దేశ వ్యాప్తంగా రైతు సమస్యల పై చర్చలు నేపథ్యంలో ఉన్న సానుభూతిని ఖమ్మం కేంద్రం లో కొందరు షోషల్ మీడియా ని వినియోగించుకొని హడావుడి చేస్తున్న రు. అందుకు నిదర్శనం గతం లో ఒక జాతీయ పార్టీ నేత సిసిఐ బయ్యర్లు జిన్నింగ్ మిల్లులు యాజిమానులు తో కుమ్మక్కు అయ్యి నాసిరకం పత్తి కొనుగోలు చేసారని పిర్యాదు చేసారు.విజిలెన్స్ విచారణ అధికారులు వచ్చే సరికి అడ్రెస్ లేకుండా పోయాడు.అదే తంతు ప్రస్తుతం మిర్చి విషయం లో సాగుతోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ALSO READ :వరి వేస్తే ఉరి…..

 

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సరుకు ఏపీ నుండి కూడా వస్తుంది..ఇక్కడ మిర్చి బయ్యర్లు తక్కువ గా ఉన్నారు. కొనుగోలు దారులు తరుపున సరుకు కొని వారికి ఇచ్చి.కమిషన్ తీసుకొనే వారు ఎక్కువ ఉన్నారు.రైతుకు ఎంత ఎక్కువ మొత్తం ధర వస్తే ఆ మేరకు దళారి వ్యాపారికి ఇరు వైపుల నుండి కమిషన్ ఎక్కువ గా వస్తుంది. సిండికేట్ అయ్యి తక్కువ ధర వచ్చే టట్లు చేసే అవకాశాలు లేవు.తగ్గించడం వల్ల రైతు కంటే ముందు దళారి ఆదాయం కోల్పోతారు.ప్రస్తుతం మార్కెట్ కు వస్తున్న సరుకు లో ఉన్న నాణ్యత ప్రకారం మంచి ధర వస్తోంది. ఈ విషయాలు మరుగున పరిచి వ్యాపారులు కుమ్మక్కు అయ్యి సిండికేట్ గా ధర తగ్గించారు అన్నది వాదన.

మాయ గాళ్ళు ఇలా..

-పిర్యాదు లో ఎక్కడ ఏ వ్యాపారులు కుమ్మక్కు అయ్యారు అన్న వివరాలు లేవు.

-ఎప్పుడు,ఎక్కడ వీరి సిండికేట్ కోసం మీటింగ్ అయ్యారు, ఏ రైతుకు,ఎంత నష్టం జరిగింది సిండికేట్ మూలంగా అన్నది లేదు.

-సరుకు లో ఉన్న నాణ్యత ఎంత,ఎంత ధర అవకాశం ఉంది.ఎంత ఇస్తున్నారు లేదు

-మార్కెట్ కార్యదర్శి కి, అధికారులు కు ఫిర్యాదులు లేవు..ఇటువంటి ఏలాంటి నిర్దిష్టత లు లేకుండా వ్యాపారులు సిండికేట్ అనే వాక్యం వాడటం,కలెక్టర్ కి పిర్యాదు చేసాము అని షోషల్ మీడియా వేదికగా ప్రచారం ఏంటి అనే విమర్శలు ఉన్నాయి.రైతులు పేరుతో హైడ్రామా అనేది తెలుస్తోంది.

ALSO READ:మూస ధోరణిలో వ్యవసాయం వద్దు

గతం లోను డ్రామా

– గతంలో బయ్యర్లు, జిన్నింగ్ మిల్లు వాళ్ళు కుమ్మక్కు అయ్యి నాసిరకం పత్తి కొనుగోలు చేసారని సిసిఐ ఒక నేత పిర్యాదు చేశారు

-తనకున్న పలుకుబడి ఉపయోగించి విజిలెన్స్ విచారణ కు అదేశింప చేసాడు

-సీజన్ మీ
ముగిసిన 2 నెలల వరకు కూడా గోదాము లోనే పత్తి బెల్లు నిల్వలు ఉన్నాయి.

-ఎన్ని సార్లు సందేశం ఇచ్చిన విచారణ అధికారులు వద్దకు .పిర్యాదు దారుడు రాలేదు.పిర్యాదు ఉపసంహరణ అంటూ మోకిక సందేశం పంపారు

-పిర్యాదు అనంతరం ఇదే హడావుడి చేశారు

-పిర్యాదు దారుడుకి అక్రమార్కులు నుండి భారీ గా ముడుపులు అందినట్లు అప్పట్లోనే ఆరోపణలు.సిసిఐ అధికారులు తీరు పైన అప్పుడు ఆరోపణలు..మిర్చి విషయంలో ను ఫిర్యాదులు పట్ల అనుమానం కలిగిస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube