మోడీ పాలనతో వ్యవసాయ సంక్షోభం

అమలు కాని స్వామినాథన్ సిఫారసులు

1
TMedia (Telugu News) :

మోడీ పాలనతో వ్యవసాయ సంక్షోభం

-అమలు కాని స్వామినాథన్ సిఫారసులు

-బోడేపూడి ఆశయాలు కొనసాగించాలి.

ఏ ఐ కే ఏస్ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, బీవీకే ట్రస్ట్ చైర్మన్ తమ్మినేని

టీ మీడియా,ఆగస్టు6,ఖమ్మం : మద్దతు ధరలు, ఎరువుల సబ్సిడీ, సంక్షేమపూరిత వ్యవసాయం, స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు… రకరకాల హామీలతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 2014 నుంచి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టిందని అఖిలభారత రైతుసంఘం సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, బీవీకే ట్రస్టు చైర్మన్ తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు 25వ వర్ధంతి సందర్భంగా బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక మంచికంటి మీటింగ్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘వ్యవసాయరంగం… వర్తమానం.. భవిష్యత్.. ప్రజలపై ప్రభావం’ అనే అంశంపై ప్రసగించారు. 1992 నుంచి మొదలైన సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా అఖిలభారత వ్యవసాయ కార్మికసంఘం పోరాటాలు నిర్వహించిందన్నారు. నాడు ఆ విధానాల దుష్ప్రభావం ప్రజలపై నేటికీ ఉందన్నారు. ఈ 20 ఏళ్లలో 20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 2014-22 వరకు రైతులు మరింత సంక్షోభంలో కూరుకుపోయారన్నారు.

 

Also Read : శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం

 

ఉత్పత్తి ఖర్చు కింద 50శాతం ఎక్కువ మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్ను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. రుణమాఫీ, పంటలకు మద్దతు ధర తదితర హామీలను విస్మరించి కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2020లో తీసుకొచ్చిన మూడు నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతు కిసాన్ మోర్చ సాగించిన పోరాటం చారిత్రాత్మకం అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అని చెబుతున్న మోడీ ప్రభుత్వం ఆహారభద్రత కూడా ఇవ్వలేకపోతుందన్నారు. సిద్ధాంతాన్ని సరళ భాషలో చెప్పటం బోడేపూడి ప్రత్యేకత అన్నారు. మంచి కమ్యూనిస్టు అంటే బోడేపూడిలా ఉండాలన్నారు. బోడేపూడి ఆశయాలు కొనసాగించెందుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సెమినార్లో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, బీవీకే ట్రస్టు కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సదస్సులో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, బండి రమేష్, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వర్లు, బంతు రాంబాబు, వై.విక్రమ్, నాయకులు కాసాని ఐలయ్య, మల్లెంపాటి వీరభద్రం, ఎం. సుబ్బారావు తదితరులు పాల్గన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube