ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేని మీరా కల్లాలను సందర్శించేది

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 22 వనపర్తి : వనపర్తి నియోజకవర్గంలో ఒక ఎకరాకు సాగునీరు ఇవ్వలేని పాలకులు కల్లాలను సందర్శించడం విడ్డూరంగా ఉందని వనపర్తి సింగల్విండో అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నిరంజన్ రెడ్డి కృషి పట్టుదల కారణంగా నియోజకవర్గంలో సాగునీరు పుష్కలంగా పడుతుందన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికి రైతుబంధు, రైతు బీమా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రైతుల పక్షాన పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే స్థాయి లేని స్థానిక నాయకులు రైతులకు చేసిన పాపం వల్లే వారి ఉసురు తగిలి ఇంట్లో కూర్చున్నారని వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ అన్నారు.

కేవలం రాజకీయ దురుద్దేశం వల్లే రైతులపై ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్ బిజెపి నాయకులు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు అందించింది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ధాన్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి కృషి కనిపిస్తుందని అన్నారు.

నియోజకవర్గాన్ని 40 సంవత్సరాలు పరిపాలన సాగించిన ఇక్కడి నాయకులు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సబబే అని వ్యాసం రాసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కానీ నిరంజన్ రెడ్డి ప్రతి ఎకరాకు నీరు అందించాలన్న ఉద్దేశంతో మాజీ మంత్రి చిన్నారెడ్డి సొంత గ్రామానికి అందించిన ఘనత నిరంజన్రెడ్డి దక్కిందన్నారు.

నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు సైతం సాగునీరు ఇవ్వాలన్న తపనతో ఎత్తిపోతల పథకాలు సాధించిన ఘనత వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల పక్షాన మాట్లాడే నైతిక విలువలు లేని ఈ ప్రాంత నాయకులు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 60 సంవత్సరాల మీ పరిపాలనలో ఏ ఒక్కరోజైనా రైతులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. ఈ పట్టణంలో కనీసం రోడ్డు విస్తరణ చేయలేని నాయకులు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube