ప్రెస్ క్లబ్ బాయ్ కి సాయం

ప్రెస్ క్లబ్ బాయ్ కి సాయం

0
TMedia (Telugu News) :

ప్రెస్ క్లబ్ బాయ్ కి సాయం
టీ మీడియా, మే13,గోదావరిఖని, ప్రతినిధి: గోదావరిఖని ప్రెస్ క్లబ్ బాయ్ మహమ్మద్ దస్తగిరి కి రెండు మూత్రపిండాలు చెడిపోయి గత రెండు సంవత్సరాలుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవిస్తున్న ఆయనకు నీడ భరోస స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రూ521 కార్డు ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ ముఖ్యఅతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం శ్యామ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ బాయ్ గా దస్తగిరి సేవలందిస్తూన్న ఆయనకు గత రెండు సంవత్సరాలుగా రెండు కిడ్నీలు చెడిపోయి కిడ్నీ డయాలసిస్ మీద జీవిస్తున్నారని అన్నారు. పేద కుటుంబానికి చెందిన దస్తగిరికి నీడ గత రెండు సంవత్సరాలుగా నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ 521 రూపాయలు అందిస్తున్నారని తెలిపారు.

 

PRESS CLUB
PRESS CLUB

ALSO RERAD:అధికారిక (అహంకారం )దందా లు

అలాగే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి మార్చి వరకు పెన్షన్ రెన్యువల్ కార్యక్రమం గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆవరణలో చేయడం జరిగిందన్నారు. అనంతరం శ్యామ్ నీడ సేవలను కొనియాడారు. నీడ చేస్తున్న సేవలు ఎవరు కూడా చేయలేరని కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు నీడతో కలిసి పని చేయాలని దస్తగిరి లాంటి వారికి ఎందరికో నీడ ఆసరాగా ఉండాలని పిలుపునిచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube