ఎయిడ్స్ నిర్మూలన కు ప్రతీ ఒక్కరూ కృషి చేయండి

ఎయిడ్స్ నిర్మూలన కు ప్రతీ ఒక్కరూ కృషి చేయండి

1
TMedia (Telugu News) :

ఎయిడ్స్ నిర్మూలన కు ప్రతీ ఒక్కరూ కృషి చేయండి

టీ మీడియా,డిసెంబర్ 1, ఖమ్మం సిటీ : ఎయిడ్స్ వ్యాది నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆర్జేసి విద్యా సంస్థల చైర్మన్ గుండాల కృష్ణ పిలుపు నిచ్చారు.ప్రపంచ ఎయిడ్స్ వ్యాది నిర్మూలన దినోత్సవం సందర్భంగా కళాశాల ఎన్.ఎస్.ఎస్. విభాగం ఇంటర్మీడియట్,డిగ్రీ యూనిట్ ల ఆద్వర్యంలో ఖమ్మం నగరం లో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాది పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.విద్యార్థులు ఈ విషయమై నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలని సూచించారు.

Also Read : మున్సిపల్ కార్మికులకు స్వెట్టర్లు పంపిణీ

విద్యార్థులు వారి సామాజిక బాధ్యత గా ఈ వ్యాది నిర్మూలనకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యం. శివకుమార్,వైస్ ప్రిన్సిపాల్ ఎ. లింగయ్య,ఇంటర్,డిగ్రీ కళాశాలల ఎన్.ఎస్.ఎస్. యూనిట్ల అధికారులు రాంబాబు,రమేష్ , అధ్యాపకులు జ్యోతి,కల్పన,సునంద, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube