ఎయిర్‌ ఇండియా భారీ డీల్‌..

ఏవియేష‌న్ చ‌రిత్ర‌లోనే ఇది అతి పెద్దది

1
TMedia (Telugu News) :

ఎయిర్‌ ఇండియా భారీ డీల్‌..

ఏవియేష‌న్ చ‌రిత్ర‌లోనే ఇది అతి పెద్దది
టి మీడియా, జూన్ 20,న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సంస్థ ఓ భారీ డీల్ చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. సుమారు 300 విమానాల‌ను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైన‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. క‌మ‌ర్షియ‌ల్ ఏవియేష‌న్ చ‌రిత్ర‌లోనే ఇది అత్యంత పెద్ద డీల్ అని భావిస్తున్నారు. కానీ ఈ డీల్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇంకా గోప్యంగా ఉంచారు. ఇటీవ‌ల ఎయిర్ ఇండియాకు కొత్త ఓన‌ర్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎయిర్ ఇండియా త‌న విమానాల సంఖ్య‌ను భారీగా పెంచేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. దానిలో భాగంగానే సుమారు 300 కొత్త విమానాల‌ను ఖ‌రీదు చేసేందుకు ఎయిర్ ఇండియా సిద్ధమైన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు

 

Also Read : డీ విచారణకు హాజరైన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

ఎయిర్‌బ‌స్ ఎస్ఈ ఏ320నియో ఫ్యామిలీకి చెందిన జెట్ విమానాల‌ను లేదా బోయింగ్ 737 మ్యాక్స్ మోడ‌ళ్ల‌ను ఎయిర్ ఇండియా ఖ‌రీదు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఈ అంశాన్ని ర‌హ‌స్యంగానే ఉంచిన‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. 300 బోయింగ్ 737 విమానాల‌ను ఖ‌రీదు చేస్తే, ఆ విలువ సుమారు 40.5 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ 300 విమానాల‌కు సంబంధించిన ప్రొడ‌క్ష‌న్‌, డెలివ‌రీ కావ‌డానికి క‌నీసం ఓ ద‌శాబ్ద స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌తి నెల‌లో ఎయిర్‌బ‌స్ సంస్థ కేవ‌లం 50 విమానాల‌ను త‌యారు చేస్తుంది. అయితే 203 నాటికి ఆ సంఖ్య‌ను 65కు పెంచ‌నున్న‌ది. 2025 నాటికి అది 75 కానున్న‌ట్లు తెలుస్తోంది.ఎయిర్‌బ‌స్‌, బోయింగ్‌, ఎయిర్ ఇండియా కంపెనీలు ఈ అంశంపై కామెంట్ చేసేందుకు నిరాక‌రించాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube