ప్రైవేటీకరణకు ఎయిరిండియా అనుబంధ సంస్థలు..

కసరత్తు ఘారు

1
TMedia (Telugu News) :

ప్రైవేటీకరణకు ఎయిరిండియా అనుబంధ సంస్థలు..
-కసరత్తు ఘారు

టీ మీడియా,సెప్టెంబర్ 19,దిల్లీ: నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించిన కేంద్ర ప్రభుత్వం… ఇప్పుడు దాని అనుబంధ సంస్థల ప్రైవేటీకరణకూసిద్ధమైంది.ఎయిరిండియాకు చెందిన ఏఐఏఎస్‌ఎల్‌ , ఏఐఈఎస్‌ఎల్‌ ను ప్రైవేటీకరించాలని భావిస్తోందని ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటికే దీపమ్‌ (పెట్టుడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ) వీటి కొనుగోలుకు ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో సమావేశాలు ప్రారంభించిందని తెలిపారు. త్వరలోనే ఆసక్తి ఉన్న బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలు ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.అప్పుల భారంతో సతమతమవుతున్న ఎయిరిండియాను ప్రభుత్వం రూ.18 వేల కోట్లకు టాటా గ్రూప్‌నకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ఈ ఏడాది జనవరి 27న పూర్తయ్యింది.

 

Also Read : భారీ అగ్నిప్ర‌మాదం

విక్రయానికి పూర్వం ఎయిరిండియాకు.. ఎయిరిండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఎయిరిండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ , అలయన్స్‌ ఎయిర్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాఅనుబంధ సంస్థలుగా ఉన్నాయి. వీటితో పాటు ఇతర నాన్‌ కోర్‌ అస్సెట్స్‌ కూడా ఉన్నాయి. అయితే ఇవేవీ టాటా గ్రూప్‌ డీల్‌లో భాగంగా లేవు. ఇందులో రూ.15 వేల కోట్ల విలువైన నాన్‌ కోర్‌ అస్సెట్స్‌ను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ అయిన ఎయిరిండియా అస్సెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు ఇప్పటికే బదిలీ చేశారు.ఎయిరిండియాకు మొత్తం రూ.61,562 కోట్ల మేర అప్పులు ఉండగా.. రూ.15,300 కోట్ల బాధ్యత టాటా గ్రూప్‌ తీసుకుంది. మిగిలిన రూ.46వేల కోట్ల రుణ భారం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎయిరిండియా అనుబంధ సంస్థలను, నాన్‌ కోర్‌ ఆస్తులను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా దీపమ్‌. ప్రైవేటీకరణకు సంబంధించిన కసరత్తును తాజాగా ప్రారంభించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube