భారత్‌కు వాయు కాలుష్యమే పెద్ద సమస్య : గడ్కరీ

భారత్‌కు వాయు కాలుష్యమే పెద్ద సమస్య : గడ్కరీ

1
TMedia (Telugu News) :

భారత్‌కు వాయు కాలుష్యమే పెద్ద సమస్య : గడ్కరీ

టీ మీడియా, నవంబర్ 3, న్యూఢిల్లీ : గాలి కాలుష్యం భారత్‌కు పెద్ద సమస్య అని, దాన్ని తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో రైతులు వరికోతల అనంతరం కొయ్యలు తగులబెడుతున్న తరుణంలో దేశ రాజధానిలో భారీగా కాలుష్యం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం కోసం కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఇది ఓ పెద్ద సమస్య అన్నారు. క్లీన్‌ ఫ్యూయల్స్‌-2022పై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆయన.. ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : కంచర్ల లక్ష్మారెడ్డి మృతి : సీఎం కేసీఆర్‌ సంతాపం

వరి పొట్టును బయో విటమిన్‌గా మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశంలో అనేక విజయవంతమైన ప్రాజెక్టులున్నాయని, వరిగడ్డితో బయో-సీఎన్‌జీ, బయో ఎల్‌ఎన్‌జీని తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా రంగాన్ని డీ కార్బనైజ్‌ చేసి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణాన్ని నిలకడగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube