కరెంటు తీగలపై కూలిన విమానం.. నిలిచిన విద్యుత్
టీ మీడియా ,నవంబర్ 28, వాషింగ్టన్: అమెరికాలోని మేరిలాండ్ రాష్ట్రంలో తేలికపాటి విమానం విద్యుత్ తీగలపై కూలిపోయింది. దీంతో మాంట్గొమెరీ కౌంటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం రాత్రి కురిసిన వానల కారణంగా ఓ చిన్నపాటి విమానం మాంట్గొమెరీ కౌంటీకి విద్యుత్ సరఫరా చేసే తీగలపై కూలిపోయింది. దీంతో వైర్లు తెగిపోయాయి. ఈ కారణంగా పట్టణంలోని 90 వేలకుపైగా నివాస, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Also Read : ఎయిర్పోర్టులో రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
కౌంటీలోని పావు భాగం ప్రస్తుతం అంధకారంలో చిక్కుకున్నదని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని వెల్లడించారు. అయితే ఈ ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.