పోరాటాల్లో ముందున్నఏఐఎస్ఎఫ్
టీ మీడియా, మార్చి 16, గోదావరిఖని :
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రామగుండం నగర సమితి జనరల్ బాడీ సమావేశం బుధవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగింది.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బాలసాని లెనిన్,ప్రేమ్ కుమార్,సిపిఐ నగర కార్యదర్శి కె.కనక రాజ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోశిక మోహన్, గౌతమ్ గోవర్ధన్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.పెద్దపెల్లి జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి బాలసాని లెనిన్ మాట్లాడారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ కార్యదర్శిగా రేణుకుంట్ల ప్రీతం, అధ్యక్షులుగా ఎలుకపెల్లి సురేష్,ఉపాధ్యక్షులుగా మాతంగి సాగర్, గాజుల అవినాష్,సహాయ కార్యదర్శిగా నాగేందర్, జంగపెల్లి శివ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బి వెంకటేష్,న్యాతరి పవన్, మణికంఠ,వినయ్, ఆవునూరి అరవింద్ ,నరేందర్,సనత్,సాత్విక్, సాయి,అఖిల్,రేవంత్, పండు,రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube