20,21 న జరిగే ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా 26 వ మహాసభలను జయప్రదం చేయండి.

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్07, మధిర:

విద్యారంగ సమూల మార్పుకై ఉద్యమ రూపకల్పనకు వేదిక గా ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు. నిర్వహించబోతుదినీ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి కరపత్రాలు ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా 26వ మహాసభలు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం సిటీ ఫంక్షన్ డిసెంబర్ 20, 21 తేదీలలో జరుగుతున్నాయని కావున ఈ మహాసభను జయప్రదం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యారంగ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చే ఏడు సంవత్సరాలు అవుతున్నా బ్రిటిష్ కాలం నాటి విద్యా విధానాలను కొనసాగిస్తు దుర్మార్గమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని విస్మరించి ముఖ్యమంత్రులు పరిపాలించిన గత ముఖ్యమంత్రులు కు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఏసీ గదుల్లో కూర్చుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ విద్యార్థులకు కనీస వసతులు కల్పించలేని అసమర్థత ముఖ్యమంత్రికి పతనం తప్పదని హెచ్చరించారు.విద్యారంగంలో ప్రవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు కేంద్రం తెరలేపిందని, పేదలు, మద్యతరగతి వర్గాల పిల్లలకు విద్యను దూరంచేసే విదంగా కేంద్రం నిర్ణయాలు చేస్తోందన్నారు. కేంద్రం తీసుకువస్తున్న 2020 విద్యా విదానం ప్రభుత్వ విద్యను కనుమరుగు చేసేందుకేనని అన్నారు, విద్యార్ధులను ఆలోచింపచేసే లౌకిక, ప్రజాస్వామ్యం వంటి పదాలను తొలగించి విద్యా కాషాయీకరణ కు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు.

రైతన్నల శ్రమను కార్పోరేట్ శక్తులు, దళారీలకు దోచిపెట్టే విధంగా సాగు చట్టాలు, విద్యుత్ సంస్కరణ బిల్లులు తీసుకువచ్చారని విమర్శించారు. పేద, మధ్య తరగతి వర్గాలకు భారంగా మారిన ఇంధన, నిత్యావసర ధరలు అదుపుచేయడంలో పాలకులు విఫలం చెందారన్నారు. కార్మిక చట్టాలను సవరిస్తూ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి, యువజనులను మోసం చేస్తూ పాలన సాగిస్తోందని, పోరాడి సాధించుకున్న తెలంగాణాలో నిరుద్యోగం రాజ్యమేలుతోందన్నారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేస్తూ మరోవైపు కార్పోరేట్ విద్యాసంస్థల ఏర్పాటుకు విచ్చల విడిగా అనుమతులిస్తూ పేద విద్యార్ధులను విద్యకు దూరంచేసే కుట్రలు చేస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యతిరేక విధానాలను మానుకొని ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అన్నారు లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు దుర్గ సాయి ఉపేందర్ రాధా కృష్ణ స్వాతి మౌనిక వేదన కీర్తి దీప్తి జ్యోతి కావ్య నవ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube