సింగరేణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

ధర్నా నిర్వహించిన ఏఐటియుసి నాయకులు

1
TMedia (Telugu News) :

సింగరేణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

– ధర్నా నిర్వహించిన ఏఐటియుసి నాయకులు

టీ మీడియా,సెప్టెంబర్ 21,గోదావరిఖని : సింగరేణి లో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆద్వర్యంలో జిడికే వన్ ఇంక్లయిన్ లో ధర్నా నిర్వహించి గని అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ తెలిపారు.బుధవారం ధర్నా అనంతరం ఆయన ఏఐటీయూసీ సీనియర్ నాయకులు ఎ.సురేష్ తో కలిసి మాట్లాడుతూ…సింగరేణి లో కార్మికులు సమస్యలను పరిష్కరించడం లో యాజమాన్యం వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.

Also Read : పింఛన్ల ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి

ముఖ్యంగా సింగరేణి కి చెందిన కోయగూడెం ఓసిపి 3 ని కేంద్ర ప్రభుత్వం అరబిందో ప్రైవేటు కంపెనీకి ఇచ్చిందని,దీనిని రద్దు చేసి సింగరేణి కి ఇవ్వాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు.సింగరేణి లో 2021-2022 ఆర్థిక సంవత్సరం లో వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి 35 శాతం వాటా చెల్లించాలని,స్వంత ఇంటి పథకం కింద ప్రతి కార్మికుడి కి రెండు గుంటల భూమి ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని, కోల్ ఇండియా లో కార్మికుల కు మరియు సింగరేణి లో అధికారులకు ఇస్తున్న మాదిరిగా అలవెన్సుల పై ఆదాయపు పన్ను ను యాజమాన్యం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read : ప్రవైట్ ఆస్పత్రి యాజిమాన్య దాష్టీకం

అదేవిధంగా గత 13 రోజులుగా సింగరేణి లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్ ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారని, వారి సమ్మె డిమాండ్లను పరిష్కరించాలి ఆయన యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,లేనిచో ఏఐటియుసి ఆద్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినెష్, ఏఐటియుసి నాయకులు రంగు శ్రీనివాస్,సంకె అశోక్, చెప్యాల మహేందర్ రావు,కానవేని బాలయ్య, మానాల శ్రీనివాస్, ఉప్పులేటి తిరుపతి, కలవేణి రాజేష్,మహేందర్, అబుబాకర్,చల్ల రవిందర్, అబ్దుల్ కరీం,చెంద్రశేఖర్, పడాల కనకరాజు, జే.దేవయ్య,గడప శ్రీకాంత్, గంగారపు చెంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube