మంత్రి అజయ్ గారు,ఎంపి నామ గార్ల ఆశీస్సులు మరియు ఎమ్యెల్యే కందాల గారి దయవల్ల ఈ అవకాశం వచ్చింది

టీ – మీడియా తో నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్

ఈ మేరకు టి – మీడియా కు ఆయన ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు.

ప్రశ్న:రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న మీకు ఇంత ఆలస్యంగా పదవి రావడం పట్ల మీ అభిప్రాయం..?

జవాబు: నేను ఇది పదవి గా ఎవరి మీదనో పెత్తనం చేయడం కోసం హోదా అని భావించడం లేదు..నాపై నమ్మకం ఉంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పగించిన బాధ్యత గా ఫీల్ అవుతున్నాను.కష్ట పడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు టిఆర్ఎస్ లో ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం సమయం వచ్చినప్పుడు అవకాశం వస్తుంది.

ప్రశ్న:ఈ బాధ్యతలు మీకు అప్పగించడానికి ప్రధాన కారణం..?

జవాబు: పాలేరు ఎమ్యెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు ఆరు నెలల క్రితం మార్కెట్ చైర్మెన్ గిరిజనులు కు ఇవ్వాలి అనుకొన్నట్లు తెలిపారు.ఇచ్చిన హామీ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు,ఎంపీ నామ నాగేశ్వరరావు గారితో ఎమ్యెల్యే గారు మాట్లాడి ఓప్పించారు.ఎవరు అయితే బాగుంటుంది అన్న విషయం పార్టీ లో,ప్రజాప్రతినిధులు తో ఎంపీపీలు, జెడ్పిటిసి లు తో అందరితో చర్చించి నన్ను ఎంతో నమ్మకం తో ఎంపిక చేసి సిఫార్సు చేశారు.జిల్లా మంత్రిగారు,ఖమ్మం ఎంపి గారు ఆశీస్సులు,ఎమ్యెల్యే గారి దయ వల్ల నాకు అవకాశం ఇచ్చారు.

ప్రశ్న: చైర్మెన్ గా మీ పని విధానం ఏవిధం గా ఉండబోతుంది..?

జవాబు: నేను రైతు బిడ్డను కేసీఆర్ గారిది రైతు ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేసే విధముగా నా పని విధానం ఉంటుంది.ఎటువంటి ఇబ్బందులు రైతులకు జరగకుండా గౌరవ ఎమ్మెల్యే కందాల గారి సలహాలు,సూచనలతో పాటు,అందరు ప్రజా ప్రతి నిధులు,అధికారులు సిబ్బంది తో సమన్వయం చేసుకొంటూ ముందుకు పోతాము.

ప్రశ్న: మీరు రైతులు కు ఇచ్చే సందేశం..?

జవాబు: వ్యవసాయ దారుడిగా రైతు కష్టాలు తెలిసిన వాడిని.మంది రైతు ప్రభుత్వం రైతులు బాగుండాలి పంటలు మంచి ధరలకు అమ్ముకోవాలి అని కేసీఆర్ గారు అనేక చర్యలు చేపట్టారు.పంట నిల్వకు గోదాముల ఉన్నాయి,రైతు సమన్వయ సమితులు ఉన్నాయి,రైతు వేదికలు నిర్మాణం జరుగుతోంది.రైతు బంధు పథకం అమలులో ఉంది..వ్యవసాయ అధికారులు సూచించిన పంటలు వేసి వ్యవసాయం పండుగ చేసు కొందాము.మార్కెట్ పాలక వర్గం మీకు అండగా ఉంటుంది.