అకాడ అకాడతో ఆత్మరక్షణ

రామగుండం ఎంఎల్‌ఏ కోరుకంటి చందర్‌

1
TMedia (Telugu News) :

అకాడ అకాడతో ఆత్మరక్షణ

-రామగుండం ఎంఎల్‌ఏ కోరుకంటి చందర్‌

టీ మీడియా,సెప్టెంబర్ 20, గోదావరిఖని :ప్రాచీన యుద్ధ విద్య అకాడ అని ఆపదలో ఉన్నప్పుడు ఆత్మరక్షణగా అకాడ ఎంతగానో ఉపమెాగపడుతుందని రామగుండం ఎంఎల్‌ఏ కోరుకంటి చందర్‌ అన్నారు.మంగళవారం ఎన్టీపీసీ విశ్వభారతి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్‌ అకాడ శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ఎంఎల్‌ఏ కోరుకంటి చందర్‌ ముఖ్య అతిథిగా హాజరై,శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టూడెంట్‌ లెడ్‌ కాన్ఫరెన్స్‌ను ఎంఎల్‌ఏ చందర్‌ ప్రారంభించి, విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంఎల్‌ఏ మాట్లాడుతూ…ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ హనుమాన్‌ అకాడ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని,ఎంతో విద్యార్థినీ,విద్యార్థులు ఈ శిక్షణ పొంది ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.

 

Also Read : బతుకమ్మ ఆటతో నిరసన తెలియచేసిన కాంట్రాక్టు కార్మికులు

పిల్లల్లో చదువుతో పాటు ఇతర క్రీడల్లో రాణించే విధంగా పాఠశాల యాజమాన్యం కృషి చేయడం ఎంతో అభినందనీయమని, పిల్లలకు మంచి విద్యాబుద్దులతో పాటు వారిలో ప్రతిభను వెలికిస్తున్న విశ్వభారతి పాఠశాల యాజమాన్యానికి ఎంఎల్‌ఏ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రమణారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి,కుమ్మరి శ్రీనివాస్‌ ఫ్యాక్స్ చైర్మెన్ మామిడాల ప్రభాకర్ నాయకులు తోకల రమేష్‌,ఈదునూరి పర్వతాలు,ఈదునూరి శంకర్‌,కుమ్మరి శారద, వీరాలాల్‌,సత్తార్‌ఖాన్‌, సాగర్‌రావు,రాము, శంకర్‌గౌడ్‌,అకాడ బాధ్యులు కంది చంద్రయ్య,కంది నాగరాజు,పాఠశాల బాధ్యులు యాదగిరిగౌడ్‌ తదితరులు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube