అక్షర దీక్ష కార్యక్రమం అద్భుతం

అక్షర దీక్ష కార్యక్రమం అద్భుతం

0
TMedia (Telugu News) :

అక్షర దీక్ష కార్యక్రమం అద్భుతం

టీ మీడియా, ఫిబ్రవరి 9, వనపర్తి బ్యూరో : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణిగిల్లలో ఈ నెల ఒకటో తారీకు నుంచి అమలవుతున్న అక్షర దీక్ష కార్యక్రమానికి 8 వ రోజు గురువారం ముఖ్యఅతిథిగా పిరమిడ్ సొసైటీ నిర్వాహకులు సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. 10వ తరగతి విద్యార్థులు 7 గంటలకే వచ్చి ప్రత్యేక తరగతులకు హాజరవ్వడాన్ని ప్రశంసించారు.

పాఠశాల విద్యార్థులంతా 8 గంటలకే పాఠశాలకు చేరుకొని అక్షర దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం అరుదైన విషయమని పేర్కొన్నారు. మంచి క్రమశిక్షణ, చక్కటి విలువలతో కూడిన విద్యను ఇక్కడ ఉపాధ్యాయులు అందిస్తున్నారని, సమాజానికి మంచి పౌరులను అందించే అవకాశం ఈ అక్షర దీక్ష కల్పిస్తున్నదని, ఇది చాలా శుభ పరిణామం అని పేర్కొన్నారు. మంచి గ్రేడులు సాధించిన పదవ తరగతి విద్యార్థులందరికీ తాను బాసట గా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు.

Also Read : మల్లన్న బ్రహ్మోత్సవాలకుఈ నెల 11న అంకురార్పణ

విద్యార్థులకు ధ్యానం యొక్క ఆవశ్యకతను వివరించి కొద్దిసేపు ధ్యానం చేయించారు. ఏకాగ్రతకు కావలసిన చిట్కాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శంకర్ గౌడ్ , పిరమిడ్ సొసైటీ నిర్వాహకులు సుఖేందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం వెంకటేశ్వర్లు గౌడ్ , విజయకుమార్, చంద్రకళ , శ్రీరాములు, కుమారి దివ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube