గాంధీ’లో కల్లు బాటిళ్ల కలకలం పట్టుకున్న సెక్యూరిటీ గార్డులు

గాంధీ’లో కల్లు బాటిళ్ల కలకలం పట్టుకున్న సెక్యూరిటీ గార్డులు

1
TMedia (Telugu News) :

గాంధీ’లో కల్లు బాటిళ్ల కలకలం పట్టుకున్న సెక్యూరిటీ గార్డులు
టీ మీడియా, మార్చి 31,హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కల్లు బాటిళ్లు కలకలం సృష్టించాయి. వివిధ రుగ్మతలతో చికిత్స పొందుతున్న కొంతమంది రోగులకు కల్లు తాగే అలవాటు ఉండడంతో కుటుంబ సభ్యులు చాటుమాటుగా తీసుకొచ్చి ఇస్తున్నారు. బుధవారం ఓ మహిళ ఆస్పత్రి ఎదుట గల కల్లు కంపౌండ్‌లో కల్లు బాటిళ్లు తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకొని ఆస్పత్రి లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నాడని, అతడికి కల్లు తాగే అలవాటు ఉందని, అది లేకపోతే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడని ఆమె చెప్పింది. రోగుల సహాయకులు కొంతమందికి కూడా కల్లు తాగే అలవాటు ఉండడంతో ప్రతిరోజూ బాటిళ్లలో తీసుకెళ్తున్నారు. ఈ వ్యవహారం బయటపడడంతో సెక్యూరిటీ గార్డులు అప్రమత్తమయ్యారు.

Also Read : బడి వేళలను తగ్గించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube