ఆల్ ఇండియా ర్యాంకర్ కు సన్మానం

ఆల్ ఇండియా ర్యాంకర్ కు సన్మానం

2
TMedia (Telugu News) :

ఆల్ ఇండియా ర్యాంకర్ కు సన్మానం

టీ మీడియా, సెప్టెంబర్ 15, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో గురువారం ఐజయ్య కాలనీలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు రావుల నాగరాజ్ కవిత దంపతుల పుత్రుడు హర్షిత్ సాయి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఓబీసీ లో 155 ర్యాంక్ సాధించిన సందర్భంగా,వార్డు మాజీ కౌన్సిలర్, అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు అయిన సతీష్ యాదవ్ , అఖిలపక్ష నాయకులు, వార్డు మిత్రులు కలిసి ర్యాంకు సాధించిన విద్యార్థిని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ర్యాంకులు పండిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు అఖిలపక్ష ఐక్యవేదిక తరపున శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నామని,

Also Read : ఎన్నికల సంఘం నియమావళి ప్రకారమే ఓట్లు నమోదు

ఇలాంటి ర్యాంకులు సాధించిన ప్రతి విద్యార్థికి సన్మానం చేస్తూ, తల్లితండ్రులు చనిపోయిన విద్యార్థులకు అఖిలపక్ష ఐక్యవేదిక తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని,అలాగే వనపర్తికి పేరు తెచ్చే విద్యార్తులను ఘనంగా సత్కరించడం జరుగుతుందని,ఇది వనపర్తి కాదు విద్యాపర్తి అని నిరూపిస్తున్న ప్రతి విద్యార్థి కూడా అభినందనీయులని, ప్రభుత్వం వీరికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షులు వెంకటేష్, మైనార్టీ నాయకుడు షఫీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నందిమల్ల చంద్రమౌళి, అడ్వకేట్ ఆంజనేయులు 30 వ వార్డ్ మిత్రులు ప్రిన్సిపల్ రాములు, శివ, బాలాజీ మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube