పల్లె పల్లెకు అఖిలపక్ష ఐక్యవేదిక

పల్లె పల్లెకు అఖిలపక్ష ఐక్యవేదిక

0
TMedia (Telugu News) :

పల్లె పల్లెకు అఖిలపక్ష ఐక్యవేదిక

టీ మీడియా, ఫిబ్రవరి 7, వనపర్తి బ్యూరో : అఖిలపక్ష ఐక్యవేదిక మండలాలలో వేసిన కమిటీలతో వారి సూచనలతో పల్లె పల్లెకు వెళ్లాలని నిర్ణయించడంతో వారి కోరిక మేరకు మార్చి నుండి పల్లె పల్లెకు అఖిలపక్ష ఐక్యవేదిక అనే నినాదంతో వెళ్తూ, అక్కడ కలిసి వచ్చే నాయకులను కమిటీలుగా వేస్తూ, వారి పేర్లు ఎక్కడ చెప్పకుండా సీక్రెట్ కమిటీలు గా వేస్తూ అవసరం ఉన్నప్పుడు వారందరినీ కలుపుకొని పోయే విధంగా తీర్మానం చేయడం జరిగింది.దానికి అనుగుణంగానే 9 మండలాల కమిటీలు విజయవంతగా పూర్తిచేయడం మా విజయంలో భాగమే. జిల్లా వ్యాప్తంగా ప్రజలు పడుతున్న కష్టాలను ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను, పల్లెల్లో జరుగుతున్న ఆక్రమణలను అడిగే వారు లేక, కంచె చేను మేసినట్లు కొందరు ప్రజా ప్రతినిధులు చేసే ఆగడాలను అడిగేవారు లేక ప్రజలు పడుతున్న కష్టాలను నష్టాలను బయట పెట్టడానికి మండల కన్వీనర్ లు నిర్ణయిoచడంతో మార్చి నుంచి పల్లె పల్లెకు వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు. మూడు సంవత్సరాల నుండి వనపర్తిలో ప్రతిపక్ష పాత్ర వహిస్తూ పలు సమస్యలపై పోరాడుతూ వస్తున్న ప్రతిపక్ష ఐక్యవేదిక మాత్రమే ప్రజల్లో ఉంది. కనుక ఇప్పటినుండి వచ్చే సాధారణ ఎలక్షన్లలో నిలబడే అభ్యర్థుల గుణగణాలు ప్రజలకు చెప్తూ ప్రజల్లో ఉంటూ, ప్రజలకు సేవ చేస్తున్న వారిలో ఎవ్వరిని ఎన్నుకొనాలే అనీ ప్రజలకు సూచన చేస్తుందని ఈ సందర్భంగా అధ్యక్షుడు తెలిపారు.

Also Read : నిత్య బోజనశాలను ప్రారంభించిన

మూడు సంవత్సరాలుగా మాపై వచ్చిన ఒత్తిడిలు, బెదిరింపులు తట్టుకుని నిలబడ్డాము ఇకపై కూడా మాపై ఎలాంటి ఒత్తిడి వచ్చిన నిజాయితీగా పని చేస్తామని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ, నిజాయితీ ఉన్న మంచి అభ్యర్థికి మా 69 మంది టీం పనిచేస్తుందని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు. ఇంతకాలం ఎలా పోరాడుతారు మాపై విమర్శలు చేసి వారికి ఒకటే చెబుతున్నాను మీరు ఎన్ని విమర్శలు చేస్తే మాకంతా లాభం ప్రతి సమస్య పరిష్కారం మీ నుండి మాకు లభిస్తుంది అన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, నందిమల్ల చంద్రమౌళి, పొట్టి నేనీ గోపాలకృష్ణ నాయుడు, రమేష్, రాజనగరం రాజేష్, వైఎస్ఆర్టీపీ సతీష్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube