పందుల బెడద తొలగించండి.

పందుల బెడద తొలగించండి.

1
TMedia (Telugu News) :

పందుల బెడద తొలగించండి.
టీ మీడియా, జూలై 8, వనపర్తి బ్యూరో :పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో పందుల సమస్య ఎక్కువ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామంలోని భగవంతు రెడ్డి కాలనీలో జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో పంచాయతీ తదితర ప్రాంతాల్లో పందులు చెత్త కుండీల వద్ద, వీధుల్లో స్వైరవిహారం చేయడంతో పారిశుధ్యం అధ్వానంగా మారి దోమలు విజంభిస్తున్నాయి. అసలే వర్షాకాలం కావడంతో దోమల కారణంగా అంటురోగాలు సోకే అవకాశం ఉందని భయాందోళనలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.

 

Also Read : రేవంత్ రెడ్డికి ఘన సన్మానం

గతంలో అధికారులు పందుల పెంపకం దారులకు ఊరికి దూరంగా పందులను ఉంచాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే కొద్దిరోజులు దూరంగా ఉన్నట్లే ఉంచి మళ్లీ మామూలుగానే గ్రామాల మధ్య వదిలేస్తున్నారు. రాత్రి వేళ్ళల్లో, తెల్లవారు జామున పందులను వీధుల్లో కాపరులు వదిలి వెళ్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి పందులను ఊరికి దూరంగా తరలించాలని రంగాపురం గ్రామ ప్రజలు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube