అన్ని దారులు శ్రీ సిటీ వైపే

మంత్రిలుతుమ్మల నాగేశ్వరరావుకోసం

0
TMedia (Telugu News) :

అన్ని దారులు శ్రీ సిటీ వైపే

-మంత్రిలుతుమ్మల నాగేశ్వరరావుకోసం

టీ మీడియా, జనవరి 2,ఖమ్మం : నూతన సంవత్సరం రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లా, నియోజకవర్గ ప్రజలతో గడపాలని ఆలోచనతో శ్రీ సిటీ లోని నివాసంలో అందుబాటులో ఉండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి తుమ్మల గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఖమ్మం పట్టణ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నత అధికారుల తోపాటు దాదాపుగా పదివేల మంది తుమ్మల గారిని కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపినారు.ఉదయం 8:00 గంటల నుండి సందర్శకుల తాకిడితో శ్రీ సిటీ ప్రాంతమంతా జన సమూహంగా మారింది. దాదాపు 6:00 గంటలు వారి నివాసంలో ఏర్పాటుచేసిన వేదికపై నిలబడి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలుపుటకు వచ్చిన అధికారులను, ప్రజా ప్రతినిధులను, పార్టీ నాయకులను,ప్రజలను, అందరిని పేరుపేరునా ఆప్యాయంగా నవ్వుతూ పలకరించినారు.

Also Read : నామినేటెడ్ పోస్టుల కోసం డిమాండ్.

దాంతోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు, సంఘాల నాయకులు తెచ్చిన కేకులు కట్ చేస్తూపలు శాఖల మరియు సంఘాల డైరీలు క్యాలెండర్లను ఆవిష్కరించారు..మరోవైపు పలు ప్రాంతాల నుండి వచ్చిన తుమ్మల గారి అభిమానులు, పార్టీ నాయకులు కార్యకర్తలను అందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా.తుమ్మల గారి తనయుడుయువజన కాంగ్రెస్ నాయకులుతుమ్మల యుగంధర్ సకల ఏర్పాట్లతోపాటు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసివచ్చిన వారిని అందరిని ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తూ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపినారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube