విద్యార్థులందరూ సత్యనాదెళ్లగా నిలవాలి : సీఎం జగన్
టీ మీడియా, ఏప్రిల్ 26, అనంతపురం జిల్లా : మన విద్యార్థులందరూ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల లాగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. అనంతపురం జిల్లా నార్పల వేదికగా జగనన్న వసతి దీవెన పథకం నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… జర్మనీ, మెల్ బోర్న్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. కోర్సు చదివేటప్పుడే తప్పనిసరి చేశామన్నారు. జగనన్న విదేశీ విద్య పథకాన్ని కూడా తీసుకొచ్చామన్నారు. ఇచ్చిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా సీఎం వైయస్ జగన్ జగనన్న వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేస్తున్నామ న్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుందన్నారు. గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు తమ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు అన్నారు. వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం క్రమం తప్పకుండా తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టిన తాము అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు.
AlsoRead:హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. షార్ట్ లూప్ ట్రిప్పులు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube