వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి

- టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు

0
TMedia (Telugu News) :

వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి

– టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు

టీ మీడియా, డిసెంబర్ 28, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలన వల్ల అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులో నిర్వహించిన టీడీపీ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024లో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకమని ప్రజలు గుర్తించేలా కార్యక్రమాలు నిర్వహించాలని శ్రేణులకు సూచించారు. పేదరికం లేని సమాజం, పదిమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని తన తపన అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే తెలుగు ప్రజలు నంబర్‌వన్‌ స్థానంలో ఉండాలనేది తన కోరిక అని వెల్లడించారు.

Also Read : మధిర మండలంలో ప్రారంభమైన ప్రజా పాలన

కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. బెంగుళూరులో ఉన్న టీడీపీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. వంద రోజుల్లో మీమీ గ్రామాల్లో పర్యటించి వైసీపీ పాలనను ఎండగడుతూ టీడీపీ వల్ల ఏపీకి కలిగే మేలును వివరించాలని కోరారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube