అల్లిపురం సాయి రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు… గాదె కేశవ రెడ్డి .

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 21, అశ్వాపురం:

సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్లిపురం సాయి రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి అన్నారు. తన జీవితకాలాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకై పాటుపడ్డారని తుమ్మలచెరువు సాగునీటి సంఘం అధ్యక్షులుగా సేవలందించారని, అదేవిధంగా రామచంద్రపురం గ్రామ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు అని , గుర్తు చేసుకున్నారు .కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు . ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి బిక్షమయ్య, తూము వీర రాఘవులు, కొండ బత్తుల ఉపేందర్ , మొగిళ్ళ వెంక రెడ్డి , కొమురెల్లి సంజీవరెడ్డి గుత్తికొండ పాములు పగడాల కృష్ణారెడ్డి కొప్పుల హనుమంతు రెడ్డి కొమురెల్లి వెంకట్ రెడ్డి, కూసుకుంట్ల రామిరెడ్డి బద్ధం సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Allipuram Sai Reddy’s death is a huge loss to the congress party…
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube