కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు
-కీలక ప్రాజెక్ట్ అటకెక్కినట్లేనా
టీ మీడియా, ఫిబ్రవరి 1, ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 2023పై తెలంగాణ గంపెడు ఆశలు పెట్టుకుంది. తెలంగాణకు ఇది చివరి బడ్జెట్ కావడంతో కేంద్ర మంత్రి నిర్మలమ్మ పద్దులు ఎలా ఉంటాయనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ బడ్జెట్ కేటాయింపుల గురించి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. మరి పార్లమెంట్ లో ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పలు కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలోని పలు సంస్థలకు కేటాయించిన నిధులను కేంద్ర మంత్రి వెల్లడించారు. సింగరేణి, గిరిజన యూనివర్సిటీలు, మణుగూరు కర్మాగారాలకు నిధులు కేటాయింపు వివరాలు దిగువన ఉన్నాయి.సింగరేణికి రూ.1600 కోట్ల కేటాయింపురాష్ట్రంలోని గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్ల కేటాయింపు,మణుగూరు, కోటభారజల కర్మాగారాలకు రూ.1437 కోట్ల కేటాయింపు,హైదరాబాద్ కు ఈఏపీ కింద రూ.300 కోట్ల కేటాయింపు,అలాగే బీబీ నగర్ ఎయిమ్స్ కు కూడా నిధుల కేటాయింపు జరిగింది.సాలార్ జంగ్ సహా పలు మ్యూజియాలు అభివృద్ధికి రూ.357 కోట్ల కేటాయింపుశ్రీఅన్న పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా రీసెర్చ్ లు చేయాలని నిర్ణయించారు.
Also Read : శ్లోక కంఠస్థ పోటీలో ప్రతిభ చాటిన విద్యార్థినీలు
ఇందుకోసం భాగ్యనగరంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లేటల్స్ రీసెర్చ్ సెంటర్ ను ఎక్స్ లెన్స్ గా మార్చనున్నారు.ఎన్నికల నేపథ్యంలో బోలెడు ఆశలు..ఈ ఏడాది తెలంగాణ , ఏపీ సహా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈసారి బడ్జెట్ లో ఈ రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తారని భావించారు. అయితే ఇటు తెలంగాణ, అటు ఏపీకి కేటాయించిన నిధులపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురాలేకపోయారు. దీనిపై వారు ఏం మాట్లాడుతారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube