టీ మీడియా,డిసెంబర్3,పినపాక:
ప్రజలకు,ప్రభుత్వాలకు వారిధిగా ఉంటూ,ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కార చేయడంలో జర్నలిస్టుల కీలకపాత్ర వహిస్తుందని పినపాక మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బిల్లా నరేందర్ బాబు అన్నారు.
శుక్రవారం పినపాక ప్రెస్ క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో పినపాక తహశీల్దార్ విక్రమ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు శంకర్,భరత్,బృహస్పతి,సుధాకర్ రెడ్డి,గంగాధర్,లక్ష్మణ్,సంతోష్,కోటి,నరేష్,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,సంపత్,రమేష్,శ్రీను,విజయ్ తదితరులు పాల్గొన్నారు.