‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’

భారతదేశం తరఫున అల్లూరి పాదాలకు వందనం

1
TMedia (Telugu News) :

 

‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’

-భారతదేశం తరఫున అల్లూరి పాదాలకు వందనం

-సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టం

అల్లూరి జయంత్యుత్సవాలలో ప్రధాని మోదీ

టి మీడియా, జులై4,భీమవరం: యావత్‌ భారతావనికే మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి జయంత్యుత్సవాల సందర్భంగా ఆయన పుట్టిన నేలపై మనమంతా కలుసుకోవడం అదృష్టమని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడారు. మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ప్రసంగంలో ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’ అనే విప్లవ గీతాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. మన్యం వీరుడి 125వ జయంత్యుత్సవాలు జరుపుకోవడం సంతోషం.

Also Read : విశ్వసపరిక్షలో నెగ్గిన శిండే

యావత్‌ భారతదేశం తరఫున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నా. ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీక ఆయన. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌ త్యాగధనులకు నమస్కరిస్తున్నా. అల్లూరి నడయాడిన అన్ని ప్రాంతాలను స్మరించుకుంటున్నాం. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు. వారి త్యాగాలను నిరంతరం స్మరించుకుని ముందుకెళ్లాలి. మనమంతా ఒకటే అన్న భావనతో ఉద్యమం జరిగింది’’ అని మోదీ అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube