మన్యం వీరుడు125వ జయంతి వేడుకలు

మన్యం వీరుడు125వ జయంతి వేడుకలు

1
TMedia (Telugu News) :

మన్యం వీరుడు125వ జయంతి వేడుకలు

టి మీడియా,జూన్ 29,అల్లవరం :

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ భక్తుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు125వ జయంతి వేడుకను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం టిడిపి అధ్యక్షులు దెందుకూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జయంతోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.కోడూరుపాడులో టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద అల్లూరి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావు, టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు, ముఖ్య అతిథిలుగా హాజరై అల్లూరి సీతారామరాజు కు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం అవలంభించిన అరాచక పాలనను ధైర్యంగా వ్యతిరేకించి పోరాటం చేసిన మహనీయుడు సీతారామరాజు అని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాట పటిమ చూపించిన అల్లూరి ఆదర్శప్రాయుడని కీర్తించారు.టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ దేశం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలు త్యాగం చేసిన త్యాగశీలి అల్లూరి అని కీర్తించారు.

Also Read : ఇంటర్ ఫ‌లితాల్లో స‌త్తా చాటిన అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ, వాణి

దేశం కోసం అల్లూరి పోరాట పటిమను గుర్తించి ఆయనను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు.పార్టీ తరపున అల్లూరి జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వ్యక్తిగతంగా క్షత్రియ వంశంలో పుట్టినందుకు ఆ మహానుభావుని రుణం తీర్చుకునేందుకు అన్ని వర్గాలను కలుపుకుంటూ పార్టీ తరపున నుంచి కూడా పార్టీలోని అన్ని వర్గాలను కలుపుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది.దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి సీతారామరాజు జయంతోత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ర్యాలీ గా సామాజిక స్ఫూర్తిని చాటుతూ డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ ను స్మరించుకుంటూ విగ్రహానికి నివాళులర్పించారు. గత పదిరోజులుగా కోనసీమలో ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజలను కలుస్తూ పలువురు క్షత్రియ పెద్దలు,యువత ఒక బృందంగా ఏర్పడి అల్లూరి జయంతి ఉత్సవాలు విజయవంతం దిశగా కృషి చేస్తున్నట్లు సత్తిబాబు రాజు తెలిపారు.భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహ ఆవిష్కరణ జూలై నాలుగున దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుందని ఈ వేడుకను విజయవంతం చేసేందుకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అందరూ ఐక్యంగా భారీ స్థాయిలో వెళ్లాలని పార్టీ శ్రేణులను సత్తిబాబు రాజు కోరారు.

Also Read : ఎంపీ నామ సిఫార్సు తో సీఎం ఆర్ఎఫ్ మంజూరు

ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గం రైతు విబాగ అధ్యక్షులు వేగిరాజు వెంకటరాజు, సమన్వయ కమిటీ నాయకులు చింతా శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, అల్లవరం మండల టిడిపి సెక్రెటరీ కోపనాతి తాతాజీ ,గోడి గ్రామ సర్పంచ్ తోట శ్రీదేవి నరసింహారావు, కొమరిగుపట్నం ఎంపీటీసీ మామిడిశెట్టి శ్రీనివాసరావు, గోడి గ్రామ ఎంపీటీసీ కాండ్రేగుల వాణి అచ్యుతం సత్యనారాయణ, దేవగుప్తం ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు, అల్లవరం మండల తెలుగు యువత అధ్యక్షులు ముత్యాల బాబి, అల్లవరం మండల ఎస్సీసెల్ అధ్యక్షులు పశ్చిమాల ఏడుకొండలు, అల్లవరం మండల బీసీ సెల్ అధ్యక్షులు గెద్దాడ శ్రీనివాసరావు ,అమలాపురం నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు పరసా కిరణ్, అమలాపురం నియోజకవర్గం తెలుగు యువత అధికార ప్రతినిధి గూడూరి పెద్దబాబు,నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నార్గన శ్రీనివాసరావు, గోడిలంక గ్రామ కమిటీ అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ రాజు ,కొమరగిరి పట్టణం గ్రామ కమిటీ అధ్యక్షులు మంతెన సురేష్ రాజు , రెళ్లిగడ్డ గ్రామ కమిటీ అధ్యక్షులు నడింపల్లి చంటిరాజు, దేవగుప్తం గ్రామ కమిటీ అధ్యక్షులు కొప్పిశెట్టి రామకృష్ణారావు , డి రావులపాలెం గ్రామ కమిటీ అధ్యక్షులు యీసకొను సాంబశివరావు, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube