క్రీడలకు అన్ని విధాలుగా ప్రోత్సాహం

క్రీడలకు అన్ని విధాలుగా ప్రోత్సాహం

1
TMedia (Telugu News) :

క్రీడలకు అన్ని విధాలుగా ప్రోత్సాహం

టీ మీడియా, జూన్ 23, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో ఒలంపిక్ డే సందర్భంగా జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ఒలింపిక్ సంఘం వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అధ్యక్షతన ఒలంపిక్స్ జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా వారితో పాటు వనపర్తి జెడ్పి చైర్ పర్సన్ లోకనాథ్ రెడ్డి, జేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం తో మారన్న పాఠశాల ముఖచిత్రాలు అని అన్నారు క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వపరంగా వివిధ రంగాల క్రీడలకు సహాయం చేస్తామని వాలీబాల్ పోటీల్లో దేశం తరఫున ఆడిన చిట్యాల తూర్పు తాండాకు చెందిన శాంతా కుమారికి సొంతంగా లక్ష రూపాయలు సహాయం అందించడంతోపాటు ప్రభుత్వం నుంచి డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. చదువులో భాగంగా విద్యార్థులు ఆట ఆడాలని శారీరక దారుఢ్యం పాఠశాలలో ఆటలు ఆడించడం చేస్తారని ప్రతి ఒక్కరు ఆట ఆడాలని వనపర్తి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు క్రీడలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.

 

Also Read : పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

 

మన ఊరు మన బడి పథకంలో మారనున్న పాఠశాల ముఖచిత్రాలు అని అన్నారు. పాఠశాలలో వంటగది, మరుగుదొడ్లు డిజిటల్ క్లాస్ రూమ్ లో క్రీడా మైదానాలు విద్యుత్ సౌకర్యం డైనింగ్ హాల్ వసతులు కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది తెలంగాణ విద్యా రంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలవాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు క్రీడాకారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube