నేను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నా

నేను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నా

0
TMedia (Telugu News) :

 

nama nageswar rao
nama nageswar rao

నేను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నా
-ఓటర్లు నా పక్షానే నిలిచారు
-అభివృద్దే నన్ను గెలిపిస్తుంది
– నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు
-బీఆర్ ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు
టీ,మీడియా, మే13,ఖమ్మం: బి ఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరావు నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లను కలిసి పోలింగ్ సరళిని పరిశీ లించారు . ఈ సందర్భంగా ఓటర్లు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే ఫోన్ లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు .వైరా మండలం తాటిపూడి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి నప్పుడు గదిలో ఒక ట్యూబ్ లైట్ మాత్రమే ఉండడం వల్ల సరిగా కనిపించడం లేదని ఓటర్లు సమస్యను నామ దృష్టికి తీసుకురాగా నామ సత్వరమే స్పందించి కలెక్టర్ కి ఫోన్ చేసి సమస్యను వివరించి, పరిష్కరించారు .

 

ఖమ్మం కవిత
పేజీ కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించు కున్న నామ నాగేశ్వరరావు తర్వాత పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడుపరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన ఖమ్మం కవిత పిజి కాలేజ్ పోలింగ్ కేంద్రంతో పాటు శాంతి నగర్,
ఎస్ ఆర్ బి జి ఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పోలింగ్ కేంద్రంతో పాటు తనికెళ్ళ ,కొణిజర్ల, వైరా, సోమవరం ,రెబ్బవరం,తాటిపూడి ,తల్లాడ ,అన్నారుగూడెం ,బోనకల్ మండలం రావినూతల, ముష్టికుంట్ల, చింతకాని మండలం నాగులవంచ తదితర పోలింగ్ కేంద్రాలను నామ నాగేశ్వరరావు సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు .పోలింగ్ శాతాన్ని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు .

 

 

నేనే గెలుస్తున్నా
ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలింగ్ జరిగిన తీరును బట్టి ఓటర్లు బీఆర్ఎస్ పక్షానే నిలిచారని అన్నారు.
తాను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నట్లు నామ స్పష్టంచేశారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్ల మనోభావాలు తెలుసుకున్నానని ,బీఆర్ఎస్ పార్టీ పక్షానే నిలిచి కెసిఆర్ కు అండగా ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు .తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ,సంక్షేమ కార్యక్రమాలు ,పని చేసిన తీరు ,రైతు బిడ్డ గా తనను జిల్లా ఓటర్లు ఆదరించారని భావిస్తున్నానని చెప్పారు .
కెసిఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ,సంక్షేమ
ఫలాలు అనుభవించిన ఖమ్మం జిల్లా ఓటర్లు తనకు ఓటు వేసి కేసీఆర్ కు అండగా నిలిచారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .తాను రెండు సార్లు గెలిచి పార్లమెంట్ కు వెళ్లి ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశానని, జిల్లా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల పైన కేంద్రాన్ని ప్రశ్నించి అనేక సమస్యలను పరిష్కరించానని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ,పెండింగ్ ప్రాజెక్టులు , రైల్వే ప్రాజెక్టులు, విభజన సమస్యల పైన గళమెత్తి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడానని చెప్పారు ఈ జిల్లా రైతు బిడ్డ నైన తాను నిత్యం జిల్లా ప్రజలతో ఉంటూ వారికి అండగా ఉండి వారితో మమేకమై ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకొని అండగా ఉన్నానని చెప్పారు. గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో ప్రజల వంచించిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూడటం ఖాయమని తేలిపోయిందనిన నామ స్పష్టం చేశారు .

ALSO READ :ఇంకా అద్దె ఇంట్లోనే కార్యాలయాలు

తనకు ఓటు వేసిన ఖమ్మం జిల్లా ఓటర్ల అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నామ పేర్కొన్నారు .అలాగే తన విజయం కోసం మొదటి నుంచి చివరి వరకు రేయింబవళ్లు తనకు అండగా నిలిచి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పని చేసిన జిల్లా, మండల , గ్రామ, బూత్ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు, ధన్యవాదాలుతెలియజేస్తున్నానని నామ పేర్కొన్నారు.

Also read:కరడుగట్టిన నేరస్తుల అడ్డా.ఓటు హక్కు వినియోగించుకున్న నామ
ఖమ్మం నగరం లోని ఎన్ ఎస్ టీ రోడ్డు లో ఉన్న కవిత పీజీ కళాశాల లోని పోలింగ్ బూత్ లో బీ.ఆర్.యస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ది నామ నాగేశ్వరరావు – చిన్నమ్మ దంపతులుతో పాటు వారి కుటుంబ సభ్యులు నామ సీతయ్య, నామ రామారావు, నామ కృష్ణయ్య, నామ పృధ్వి తేజ, నామ భవ్య తేజ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube