14న అమర వీర జవాన్ల దినోత్సవం నిర్వహించాలి
టీ మీడియా, ఫిబ్రవరి 12, వనపర్తి బ్యూరో : విశ్వ హిందూ పరిషత్, భజరంగదల్ నాయకులు, ప్రతినిధులు దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్వహించే ఏ కార్యక్రమాన్ని అయినా బహిష్కరించాలని దాంట్లో భాగంగా ఫిబ్రవరి 14 ‘ పాశ్చాత్య వాలంటైన్ డే’ను బహిష్కరించి, అదే విధంగా 2019 లో ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల స్మరణార్ధం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వీర జవాన్ల దినోత్సవంగా జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. శనివారం జిల్లా కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధానకార్యదర్శి వాకిటి హర్షవర్ధన్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14న మన దేశ భావాలకు, సంస్కృతికి వ్యతిరేఖమైన వ్యాలెంటైన్ డేను బహిష్కరించాలని అదే సమయంలో పూల్వామా ఉగ్ర దాడిలో అమరులైన అమర వీర జవాన్ల త్యాగ నిరతిని స్మరియిస్తూ మన దేశ సంస్కృతికి చిహ్నమైన గోవును కౌగిలించుకుని అమర వీరుల బజరంగదల్ జిల్లా సంయోజక్ మద్ద శివకృష్ణ యాదవ్ మాట్లాడుతూ బజరంగ దల్ ప్రేమకూ, ప్రేమికులకూ వ్యతిరేకం కాదని, కానీ ప్రేమ పేరుతో విదేశీ విశృంకల పాశ్చాత్య పోకడలకు వ్యతిరేకమనీ,
Also Read : వినికిడి యంత్రానికి ఆర్థిక సహాయం
అలాగే మనదేశ సంస్కృతి, సాంప్రదాయాలను విచ్చిన్నం చేసే విదేశీ కుట్రలను తిప్పి కొట్టాలంటే ముందుగా పాశ్చాత్య సాంప్రదాయాలకు దూరంగా ఉండాలని, అందుకోసం నేటి యువతీ యువకులు కలిసి అమర వీర జవాన్ల స్మరించుకునే కార్యక్రమాలను చేపట్టాలని, తెలియజేయడమైనది.కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు సాయితేజ, బజరంగల్ పట్టణ సహా సంయోజక్ సంతోష్ యాదవ్ ,ఆకాష్ చంద్ర సాగర్, కురుమూర్తి, మేఘష్యం, సురక్షిత్, మహేందర్, భరత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube