తెలంగాణలో అమరరాజా గ్రూప్ భారీ పెట్టుబడి
టీ మీడియా, డిసెంబర్ 2, హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా అమరరాజా గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు అమరరాజా సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. రాష్ట్రంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు 4,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, అమరరాజా గ్రూప్ డైరెక్టర్ గల్లా జయదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్న అమరరాజా గ్రూప్ సంస్థకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు ముందుకొచ్చిన జయదేవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : ఎయిమ్స్ సర్వర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు
సుమారు రూ. 9,500 కోట్ల పెట్టుబడులు రావడం గొప్ప విషయమన్నారు. అమరరాజా కంపెనీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. 37 ఏండ్లుగా అమరరాజా సేవలందిస్తోంది.పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.తెలంగాణలో మా సంస్థ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే 10 ఏండ్లలో తెలంగాణలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని జయదేవ్ స్పష్టం చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube