అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్

రూ 25,000లోపు వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2టీ సొంతం

1
TMedia (Telugu News) :

అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్

-రూ 25,000లోపు వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2టీ సొంతం
టీ మీడియా,ఆగస్టు 6, న్యూఢిల్లీ : అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్‌లో వన్‌ప్ల‌స్ నార్డ్ 2టీ రూ 25,000 కంటే త‌క్కువ‌గా క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులో ఉంది. ఆగ‌స్ట్ 10 వ‌ర‌కూ ఫ్రీడం సేల్ సాగ‌నుండ‌గా వ‌న్‌ప్ల‌స్ హాట్ డివైజ్‌ను ఆకర్ష‌ణీయ ధ‌ర‌లో సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2టీ అమెజాన్‌పై భారీ డిసౌంట్లు ఆఫ‌ర్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ‌ర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్ల‌తో భార‌త్‌లో వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2టీని రూ 25,000 క‌న్నా త‌క్కువ ధ‌ర‌తోనే సొంతం చేసుకునే అవ‌కాశం ఉంది.

 

Also Read : మ‌హిళా టెకీ అనుమానాస్ప‌ద మృతి

 

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2టీ 8జీబీ, 128జీబీ అమెజాన్‌పై రూ 28,989కి లిస్ట‌వ‌గా ఎస్‌బీఐ కార్డుదారుల‌కు రూ 2000 డిస్కౌంట్‌తో డివైజ్ ధ‌ర రూ 26,998కి త‌గ్గింది. ఇక ఇది కాకుండా ఆండ్రాయిడ్ డివైజ్‌ల‌పై అమెజాన్ రూ 3000 అద‌నంగా త‌గ్గిస్తోంది. మీరు ఆండ్రాయిడ్ పోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయ‌ద‌లిస్తే అవి మెరుగైన కండిష‌న్‌తో ఉంటే మ‌రింత ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ ల‌భిస్తుంది. దీంతో వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2టీ దాదాపు 21,000కే క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో పాటు పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసిన వారికి ఈ ధ‌ర ల‌భిస్తుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube