వెయ్యి మందిని తొలగించనున్న అమెజాన్

వెయ్యి మందిని తొలగించనున్న అమెజాన్

0
TMedia (Telugu News) :

వెయ్యి మందిని తొలగించనున్న అమెజాన్

టీ మీడియా, జనవరి 13, న్యూఢిల్లీ : ఆర్థిక మందగనం, ద్రవ్యోల్భణం భయాల మధ్య ప్రముఖ సాఫ్ట్‌వేర్‌, ఈ-కామర్స్‌ కంపెనీలు, సామాజిక మాధ్యమాలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతున్నాయి. కొత్త నియామకాలను తగ్గించడంతోపాటు ఉన్నవారిని ఉద్యోగాల్లోనుంచి తీసేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేసేందుకు సిద్దమైంది. ఇందులో భారత్‌కు చెందిన సుమారు 1000 మంది ఉన్నట్లు తెలుస్తున్నది. వీరంతా సాఫ్ట్‌వేర్‌, హూమన్‌ రిసోర్స్‌, ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారని, జనవరి 18 తర్వాత వీరికి ఈ-మెయిల్‌, సామాజిక మాధ్యమాలైన లింక్‌డ్‌ఇన్‌, ట్విట్టర్‌ ద్వారా తొలగింపునకు సంబంధించిన సమాచారాన్ని అందించనున్నట్లు తెలుస్తున్నది.

Also Read : శరద్‌ యాదవ్‌కు నివాళులర్పించిన రాహుల్‌ గాంధీ

కాగా, తాజాగా వేటు పడనున్న ఉద్యోగులకు ఐదు నెలల జీతాన్ని ముందుగానే చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. మరిన్ని విషయాలకోసం టీమ్‌ లీడర్లను కలవాల్సిందిగా మెయిల్స్‌ పేర్కొంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube