ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయి బ్రాహ్మణులు

ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయి బ్రాహ్మణులు

1
TMedia (Telugu News) :

ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయి బ్రాహ్మణులు

 

టీ మీడియా, నవంబర్ 8, వనపర్తి బ్యూరో : హెయిర్ కటింగ్ రంగంలోకి రిలయన్స్ రావడాన్ని వ్యతిరేకిస్తు నాయి బ్రాహ్మణ సేవా సంఘం, వనపర్తి జిల్లా కమిటీ, వనపర్తి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మంగళవారం నిరసన కార్యక్రమం చేసి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపిన నాయి బ్రాహ్మణులు భారత దేశంలో తెలంగాణ రాష్ట్రంలో (సెలూన్) క్షవర వృత్తిలోకి ఇతర సామాజిక వర్గాలను, రిలయన్స్ అంబానీ లాంటి బడ పెట్టుబడిదారీ కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ సెలూన్లను ఏర్పాటు చేయకుండా అరికట్టే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, నాయి బ్రాహ్మణుల (సెలూన్ల) క్షవర వృత్తి భద్రత కోసం ప్రభుత్వం జీవో జారీ చేయాలని, సెలూన్లను నడుపుతూ జీవనాధారం పొందుతున్న నాయి బ్రాహ్మణులకు అండగా నిలవాలని, నాయి బ్రాహ్మణుల కులవృత్తి హక్కును ఇతర సామాజిక వర్గ, కులస్తులకు, బడా పెట్టుబడిదారీ కంపెనీలకు, అవకాశం ఇవ్వకుండా, క్షవర వృత్తి పై, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి పేటెంట్ హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ బడా కార్పొరేట్ సంస్థ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన చేశారు.

 

Also Read : విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

 

ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం, జిల్లా అధ్యక్షులు మణిగిల్ల సత్యం, టౌన్ అధ్యక్షులు పూడూరు మోహన్, టౌన్ ప్రధాన కార్యదర్శి సదుర్ల మహేందర్, టౌన్ గౌరవ అధ్యక్షులు సదుర్ల రామస్వామి, సంఘం సీనియర్ నాయకులు శ్రీనివాసులు, మందపురం కృష్ణయ్య , కోకిల వెంకటేష్ , చందాపూర్ పాండు , సదుర్ల ఆంజనేయులు , సదుర్ల నాగరాజు ,సదుర్ల సంపత్, పానుగల్ సదుర్ల ఆంజనేయులు , అశ్విని గోవిందు , పుల్లూరు పాండు, బ్యాండ్ చంద్రయ్య , పుల్లూరు నరసింహా, సదుర్ల చిన్న, అశ్విని మంజునాథ్ , అశ్విని చంద్రకుమార్ , శ్రీరంగాపూర్ సాయిబాబా , సదుర్ల సిద్దు, బాలకృష్ణ , శ్రీనివాసులు, విశ్వనాథం, సన్నాయిల శేఖర్ , గోవిందు , అశ్విని ప్రకాష్, అశ్విని పవన్ , కుమార్ , పరమేష్ నాయి, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube