అంబేద్కర్ విగ్రహాలకు రంగులు, మరమ్మతులు చేయించాలని జాయింట్ కలెక్టర్‌ కు వినతిపత్రం

అంబేద్కర్ విగ్రహాలకు రంగులు, మరమ్మతులు చేయించాలని జాయింట్ కలెక్టర్‌ కు వినతిపత్రం

2
TMedia (Telugu News) :

అంబేద్కర్ విగ్రహాలకు రంగులు, మరమ్మతులు చేయించాలని జాయింట్ కలెక్టర్‌ కు వినతిపత్రం

టీ మీడియా ఏప్రిల్ 8 ఖమ్మం :జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కుల సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో , మండలాల్లో , గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు రంగులు వేయించి , మరమ్మతులు చేయించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు . ఏప్రిల్ 14 న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కొత్త హంగులతో అంబేద్కర్ విగ్రహాల వద్ద ఘనంగా జయంతి వేడుకలను జరుపుకొని దళిత సామాజిక వర్గాలను మరియు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు . అక్కడక్కడా కొన్ని చోట్ల తొలగించిన అంబేద్కర్ విగ్రహలను మళ్లీ యథాస్థానంలో పునరుద్ధరించాలని కోరారు . ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘల నాయకులు గుంటేతీ వీరభద్రం , బచ్చలకూర వెంకటేశ్వర్లు , ముడుసు జాకోబ్ , భద్రునాయక్ , కామ ప్రభాకర్ , కట్టే సుధాకర్ , దాసరి శ్రీను , మనోహర్ , వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Aమనభూమి- మన ఆరోగ్యం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube