టీ మీడియా, డిసెంబర్ 6, మహానంది:
మహానంది మండలం గాజులపల్లి గ్రామం ఎస్సీ కాలనీ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎపి ఎమ్మార్పీఎస్ మహానంది మండల అధ్యక్షులు మధు ఈ సందర్భంగా ఎపి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మధు మాట్లాడుతూ ఆయన రాసిన రాజ్యాంగం ఎంతో పవిత్రమైనదని ఆయన అడుగుజాడలే మనకు మార్గదర్శకం అని అన్నారు.
ఎంతో వెనకబడ్డ వర్గాల వారిని అభివృద్ధి పథంలో నిలిపి వెలుగులోకి ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.ఇలాంటి మహాత్ములు యుగానికి ఒకరే పుడతారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సాయి, బాలాజీ, తదితరులు చిన్నారులు పాల్గొన్నారు.
