అంబేద్కర్ ఆశయాలు మరవలేనివి

అంబేద్కర్ ఆశయాలు మరవలేనివి

1
TMedia (Telugu News) :

అంబేద్కర్ ఆశయాలు మరవలేనివి

టీ మీడియా, డిసెంబర్ 6, కరకగూడెం : భారత రాజ్యాంగ నిర్మాత,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు మరవలేనివి అని,ఆయన ఆశయాలను సాధించడమే ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యమని ఎంపీపీ రేగా కాళిక అన్నారు. మంగళవారం కరకగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ…అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని,అందరివాడని తెలిపారు.ఆ మహానీయుని స్ఫూర్తితో సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని దళిత వాడలా అభివృద్ధి చేస్తున్నారని,దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం దళిత బంధు పథకం తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూర్గంపహడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు,మండల కో ఆప్షన్ షేక్ సోందుపాషా,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ,మండల యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,మండల యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల దిలీప్,

Also Read : మంత్రికి పూలబోకెలతో ఘనంగా స్వాగతం

పినపాక నియోజకవర్గ ఉపాధ్యక్షులు కటకం లెనిన్,మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు గాందర్ల సతీష్, మండల యువజన విభాగం కార్యదర్శిలు సిద్ధి సునీల్ కుమార్, ఎగ్గడి శ్రీనువాసు,కన్నాయిగూడెం గ్రామ కమిటీ యువజన విభాగం అధ్యక్షులు పోలెబోయిన శేఖర్,ఊకే గణేష్,కంటెం నాగేష్, నరందాసు వెంకటేశ్వర్లు,బోడ థామ్సన్,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube