లిక్కర్ స్కామ్ కేసులో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసిన ఈడీ
లిక్కర్ స్కామ్ కేసులో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసిన ఈడీ
లిక్కర్ స్కామ్ కేసులో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసిన ఈడీ
టీ మీడియా, నవంబర్ 30, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది. అమిత్ అరోరా బడ్డీ రిటైల్ సంస్థకు డైరెక్టర్గా ఉన్నారని పేర్కొంది. వ్యాపారులు అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేలు సిసోడియాకు సన్నిహితులని ఈడీ వెల్లడించింది. వీరు మద్యం లైసెన్సుదారుల నుంచి సేకరించిన డబ్బును ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లించడంలో చురుగ్గా వ్యవహరించారని తెలిపింది. మద్యం కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.