ఆర్మూర్ సభలో కేసీఆర్, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ అమిత్ షా

ఆర్మూర్ సభలో కేసీఆర్, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ అమిత్ షా

0
TMedia (Telugu News) :

ఆర్మూర్ సభలో కేసీఆర్, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ అమిత్ షా

టీ మీడియా, నవంబర్ 24, నిజామాబాద్: ఇచ్చిన ఒక్క మాట, హామీని కేసీఆర్ నెరవేర్చలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆర్మూర్ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. టర్మరిక్ బోర్డు ఇచ్చింది బీజేపీ అని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో బీడీ వర్కర్స్ కోసం ప్రత్యేక హాస్పిటల్, ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ ఇచ్చామన్నారు. బీజేపీ సర్కార్‌లో హైదరాబాద్ విమోచన దినం జరుపుతామని వెల్లడించారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ మాట తప్పారన్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. జీఎస్టీ మార్పులు తీసుకువస్తామని.. ఏడాదిలో నాలుగు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందిస్తామన్నారు. డబ్బులు ఎక్కువగా ఎవరు ఇస్తే కేసీఆర్ మంత్రి వర్గంలో వారే ఉంటారని తెలిపారు. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read : మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్‌తోనే సాధ్యం

యువతకు ఉద్యోగాలు కల్పించి, పేపర్ లికేజి ఘటనపై విచారణ జరిపి జైల్‌కు పంపుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతో సుపరిపాలన సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్‌లో కేవలం మంత్రి పదవి పొందాలంటే ఢిల్లీలో చర్చించాలి అని.. అలాంటి పార్టీ అవసరమా అని అమిత్ షా ప్రశ్నించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube