వేపచెట్టుకు అమ్మవారి ఆకారం

మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

1
TMedia (Telugu News) :

వేపచెట్టుకు అమ్మవారి ఆకారం

 -మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

లహరి ,నవంబరు 28,నంద్యాల : సృష్టిలో అప్పుడప్పుడు ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్ని సందర్బాల్లో నమ్మలేని వింత ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని ఘటనలు చూస్తే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని భయం కలిగించే అంశాలు ఉంటాయి. మనం ఊహించిన దానికంటే..వేపచెట్టుకు అమ్మవారి ఆకారం.. మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. ఎక్కడంటే.సృష్టిలో అప్పుడప్పుడు ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్ని సందర్బాల్లో నమ్మలేని వింత ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని ఘటనలు చూస్తే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని భయం కలిగించే అంశాలు ఉంటాయి.

మనం ఊహించిన దానికంటే అనుకోని అనుభవాలే ఎక్కువగా ఎదురవుతుంటాయి. వేపచెట్టుకు పాలుకారడం, సాయిబాబా ఫోటో నుంచి విభూది రాలడం, వినాయకుడు పాలు తాగటం లాంటి మరెన్నో ఘటనల గురించి గతంలో విన్నాం. అలాగే కొన్ని చోట్ల గ్రామాల్లో అమ్మవారి విగ్రహలు ప్రత్యక్షం కావడం, కొంతమంది వ్యక్తులపై అమ్మవారు వాలి భవిష్యత్తు గురించి చెప్పడం, చెట్ల కింద అమ్మవారి విగ్రహలు వెలియడం వంటి ఘటనలు గురించి విన్నాం. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ చెట్టుకు అమ్మవారికి ఆకారం బయటపడటంతో.. చుట్టుపక్కల వారంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ప్రారంభించారు. తమ ఇష్టదైవం.. వేప చెట్టుపై ప్రత్యక్షం అయ్యిందంటూ భక్తులంతా ఈ చెట్టు వద్దకు క్యూ కట్టి పూజలు చేస్తున్నారు.

Also Read : రొయ్యల కొనుగోలు, ఎగుమతుల ఉంటాయి

నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో వింత ఘటన చోటుచేసుకుంది. తెలుగుపేటలోని పాతబావి వద్ద వేప చెట్టుకు అమ్మవారి ఆకారం బయటపడింది. దీంతో వేప చెట్టుపై అమ్మవారు వెలిశారని భక్తులు మొక్కులు చెల్లించడం ప్రారంభించారు. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి, ఆభరణాల అలంకరించి పూజలు చేశారు స్థానికులు. తెలుగు పేట కాలనీవాసులు ఇంటి ఇలవేల్పుగా భావించే సాక్షాత్తు పెద్దమ్మతల్లి వేప చెట్టుపై దర్శనం ఇచ్చిందంటూ.. అమ్మవారి రూపం ఆకారం ఏర్పడిన చోట భక్తిశ్రద్ధలతో పసుపు కుంకుమలు రాసి , ఆభరణాలు అలంకరించి , ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేపచెట్టు పై అమ్మవారు వెలిశారన్న సమాచారం పట్టణం లోని వివిధ కాలనీవాసులకు తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు.వేప చెట్టుకు నైవేద్యం పెట్టి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. గత కొద్ది నెలల క్రితం చెట్టు పైభాగాన్ని రంపంతో కోసి తొలగించారు. చెట్టును కోసి వేయడం వల్లే అమ్మవారు ఆగ్రహించి , వేప చెట్టుపై అమ్మవారుగా దర్శనమిచ్చారనే ప్రచారం జరుగుతుంది. చెట్లను నరికి వేయొద్దని సందేశాన్ని అమ్మవారు స్పష్టంగా తెలియజేసారని భక్తులు చెబుతున్నారు. చెట్టు మొదలు బాగం లో అమ్మవారి రూపం తో ఆకారం ఏర్పడి కనిపించడంతో స్థానికుల్లో భక్తి భావం ఏర్పడింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube