మద్యం సేవించేవారిలో కాలేయ సమస్యలు

మద్యం సేవించేవారిలో కాలేయ సమస్యలు

0
TMedia (Telugu News) :

     మద్యం సేవించేవారిలో కాలేయ సమస్యలు

 

లహరి, ఏప్రిల్ 28, న్యూఢిల్లీ : మద్యం సేవించేవారిలో కాలేయ సమస్యలెక్కువగా తలెత్తుతున్నాయని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ కాలే దినోత్సవం (ఏప్రిల్‌ 19) సందర్భంగా హెల్త్‌ థింక్‌ ట్యాంక్‌, ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌బీయింగ్‌ కౌన్సిల్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలిరీ సైన్స్‌ (ఐఎల్‌బిఎస్‌)లు కలిసి సంయుక్తంగా బుధవారం ఓ సమ్మిట్‌ని నిర్వహించాయి. ఈ సమ్మిట్‌లో.. మద్యపానం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాటిల్లో ప్రధానంగా కాలేయ సమస్యలు ఎక్కువవుతున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమ్మిట్‌లో ప్రొఫెసర్‌ అండ్‌ ఛాన్సెలర్‌ డాక్టర్‌ ఎస్‌.కె సరిన్‌ మాట్లాడుతూ… ‘కాలేయ సమస్యలతో బాధపడుతూ మా వద్దకు వచ్చే రోగుల్లో సగం మంది మద్యం సేవించేవారే. మద్యంసేవించడం వల్ల కలిగే దుష్ప్రరిణామాలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి’ అని ఆయన అన్నారు. ఈ సందర్బంగా యూత్‌కి, కుటుంబ సభ్యులకు కాలేయ రక్షణకు అవగాహన కల్పించేందుకు ఐహెచ్‌డబ్ల్యు (ఇండియన్‌ లివర్‌ హెల్త్‌ సమ్మిట్‌), ఐఎల్‌బిఎస్‌లు కలిసి సంయుక్తంగా ప్లే-సేఫ్‌ వెబ్‌సైట్‌ని ప్రారంభించాయి.

AlsoRead:మద్యం తాగించి నా కిడ్నీ దొబ్బేశారు

 

కాగా, ఈ సమ్మిట్‌లో మద్యపాన నిషేధానికి ప్రచారకర్తగా ఉన్న నోబెల్‌బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యర్థి మాట్లాడుతూ.. ‘చిన్నారులను అంబాసిడర్‌లుగా ఉపయోగించుకుని కుటుంబ సభ్యులకు మద్యపాన నిషేధంపై అవగాహన కల్పించాలి. మద్యపానం ఓ విషయ విలయం. ఇందులో చిక్కుకుంటే అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. లైంగిక వేధింపులకు దారితీస్తుంది. అందుకే ఈ విషయం అంతం కావాలంటే తప్పనిసరిగా వైద్యులు, మీడియా, మద్యం సేవించడం వల్ల కలిగే ప్రభావాలపై అవగాహన కల్పించాలి’ అని అన్నారు. ఇక ఐహెచ్‌ డబ్ల్యు కౌన్సిల్‌ సిఇఓ కమల్‌ నారాయణ ఈ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. ఫార్మా పరిశ్రమ, ప్రభుత్వం, నెఫ్రాలజిస్ట్‌లతో సహా అందరూ కాలేయ ఆరోగ్య నిర్వహణ కోసం అందరూ కలిసి రావాల్సిన అవసరముంది’ అని ఆయన అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube