గ్యాస్ సిలిండ‌ర్‌లో అమ‌ర్చిన ఐఈడీ

నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు

0
TMedia (Telugu News) :

గ్యాస్ సిలిండ‌ర్‌లో అమ‌ర్చిన ఐఈడీ

– నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు

టీ మీడియా, డిసెంబర్ 27, శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్‌లోని లావ‌పురాలో భారీ ఉగ్ర కుట్ర‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు భ‌గ్నం చేశాయి. గ్యాస్ సిలిండ‌ర్‌లో అమ‌ర్చిన ఐఈడీని బ‌ల‌గాలు నిర్వీర్యం చేశాయి. లావ‌పురాలోని పోలీసు చెక్‌పాయింట్ స‌మీపంలో ఓ అనుమానాస్ప‌ద వ‌స్తువు ఉన్న‌ట్లు బ‌ల‌గాల‌కు స‌మాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని బ‌ల‌గాలు త‌మ ఆధీనంలోకి తీసుకున్నాయి. అనంత‌రం రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు క‌లిసి ఆ అనుమానాస్ప‌ద వస్తువును సిలిండ‌ర్‌గా గుర్తించారు. దాంట్లో ఐఈడీ ఉన్న‌ట్లు గుర్తించిన బ‌ల‌గాలు, అనంత‌రం నిర్వీర్యం చేశాయి. గ‌త నెల న‌వంబ‌ర్‌లో 2 కేజీల ఐఈడీని బ‌ల‌గాలు నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. జ‌మ్మూలోని న‌ర్వాల్ – సిధ్రా హైవేపై ఓ టిఫిన్ బాక్సులో ఐఈడీని ఉంచిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Also Read : ‘భారత్‌ న్యాయ్ యాత్ర ‘ చేపట్టనున్న రాహుల్‌ గాంధీ

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube