అనంతసేనుడి అశ్లీల బాగోతం

మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల

1
TMedia (Telugu News) :

అనంతసేనుడి అశ్లీల బాగోతం

-మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల
-సెల్‌ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు

-భార్యను అంతమొందించేందుకు కుట్ర

టి మీడియా,జూలై 13,అనంతపురం (డి.హీరేహాళ్‌, రాయదుర్గం): జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మురడి అంజన్న ఆలయ అర్చకుడు అనంతసేన రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. స్వయాన ఆయన భార్య స్రవంతి మీడియాకు ఆధారాలు అందజేశారు. ఆమె తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన స్రవంతికి డి.హీరేహాళ్‌ మండలంలోని మురడి అంజన్న ఆలయ అర్చకుడు అనంతసేనతో 2008 సంవత్సరంలో వివాహమైంది. ఇద్దరు పిల్లలు జన్మించే వరకు వారి సంసారం సాఫీగా సాగింది. తర్వాత అనంతసేన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆలయానికి వచ్చే మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల వేసేవాడు. ఈ క్రమంలో కొందరిని లొంగదీసుకుని రాసలీలలు సాగించాడు. మరోవైపు భార్యను వేధించడం మొదలుపెట్టాడు.
అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి గెంటేసేందుకు ప్రయత్నించాడు. ఆలయానికి వచ్చే మహిళలు ఎంతో అందంగా ఉంటారని, నీవు మాత్రం వారిలా లేవంటూ తరచూ మనోవేదనకు గురిచేసేవాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో స్రవంతి ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ పెద్దలు సర్దిచెప్పి కాపురానికి పంపారు. తర్వాత అతని సెల్‌ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు చూసి ఆమె విస్తుపోయింది. పరాయి మహిళలతో రాసలీలల వ్యవహారంపై భర్తను నిలదీసింది. అయినా అతను పద్ధతులు మార్చుకోలేదు. పైగా భార్యను అంతమొందించేందుకు కుట్ర పన్నాడు. ఈ విషయం తెలిసి ఆమె పిల్లల సహా రాత్రికి రాత్రే పుట్టింటికి వెళ్లిపోయారు. తర్వాత అతను స్రవంతికి మతిస్థిమితం లేదంటూ విడాకుల నోటీసు పంపించాడు.

 

Also Read : పంప్‌హౌస్‌ చుట్టూ వరద
పెద్దమనుషుల సమక్షంలో ఘర్షణ
విడాకుల నోటీసు విషయంపై మాట్లాడేందుకు స్రవంతి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం మురడికి వచ్చారు. ఈ సందర్భంగా అర్చకుడు అనంతసేనను నిలదీశారు. అలాగే అతను ఇతర అమ్మాయిలను ముద్దు పెడుతూ అభ్యంతరకరంగా దిగిన ఫొటోలను పెద్ద మనుషుల సమక్షంలో చూపడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. పోలీసులు, పెద్దలే తనకు న్యాయం చేయాలని స్రవంతి వేడుకున్నారు. అనంతరం ఆమె రాయదుర్గం రూరల్‌ సీఐకు ఫిర్యాదు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube