దుర్గంధం మధ్య అంగన్‌వాడీ కేంద్రం

0
TMedia (Telugu News) :

చిన్నారులు ఆరోగ్యం అంటే అంత అలుసా

టీ మీడియా, నవంబర్ 19, మహానంది:

ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవాల్సిన చిన్నారులు దుర్గంధం మధ్య చదువుకోవాల్సి వస్తోంది. మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వద్ద అపరిశుభ్రత,నెలకొంది. అంగన్‌వాడీ కేంద్రం పక్కనే ఉన్న స్థలంలో చెత్తా చెదారం నిండుకోవడంతో పాటు ముళ్లపొదలు పెరిగి పందులకు నిలయంగా మారాయి పందులు విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని అక్కడి స్థానికులు తెలిపారు అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులు ఈ దుర్వాసనను భరిస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుర్గంధం వెదజల్లుతోందని అసలే సీజనల్ వ్యాధులు ఇలాంటి పరిస్థితుల్లో టైఫాయిడ్, మలేరియా వంటి రోగాలకు చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు
సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రం వద్ద పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అక్కడి స్థానిక ప్రజలు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube