టీ మీడియా నవంబర్ 30 వనపర్తి : వనపర్తి పట్టణంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) అనుబంధం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో, డిడబ్ల్యూఓ జిల్లా సంక్షేమ అధికారి పుష్పవతి కి మంగళవారం అంగన్వాడీలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ప్రసంగిస్తూ అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఐసిడిఎస్ ను కొనసాగించాలని పెంచిన పిఆర్సి వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సూపర్ వైజర్ ఎగ్జామ్ తేదీని ఆలస్యం కాకుండా తక్షణమే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు 2018 అక్టోబర్ నుండి చెల్లించాలని మినీ అంగన్వాడీ టీచర్ లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలని 2017 నుండి పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు గ్యాస్ బిల్లులు టి.ఏ డి.ఏ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు .జీవో నెంబర్ 14 సవరించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని జీవో నెంబర్ 19 సవరించాలని గ్రాట్యుటీ టీచర్లకు మూడు లక్షలు హెల్పర్లకు రెండు లక్షలు ఇవ్వాలని రిటైర్మెంట్ తర్వాత చివరి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు జి.జ్యోతి ,జిల్లా నాయకులు విజయలక్ష్మి, భాగ్యమ్మ, అలివేల, ఈశ్వరమ్మ, నాగేంద్రమ్మ, శ్రీ లత, నాగవేణి ,తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
