అంగన్‌వాడీల నిరాహార దీక్షలు ప్రారంభం

అంగన్‌వాడీల నిరాహార దీక్షలు ప్రారంభం

0
TMedia (Telugu News) :

అంగన్‌వాడీల నిరాహార దీక్షలు ప్రారంభం

టి మీడియా, జనవరి 5,అమరావతి: అంగన్‌వాడీ సంఘాల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టారు. డిసెంబరు 12 నుంచి జరుగుతున్న సమ్మెకు కొనసాగింపుగా విజయవాడలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను యూనియన్‌ అఖిల భారత కార్యదర్శి ఎ.ఆర్‌ సింధు ప్రారంభించారు. శనివారం నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దీక్షలు ఉంటాయని వెల్లడించారు. నిర్దిష్టమైన డిమాండ్లతో 24 రోజులుగా సమ్మె జరుగుతోందని, మంత్రుల బృందంతో గానీ, సిఎస్‌తో గానీ చర్చలు జరిగినప్పటికీ వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుకు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఏదీ ఇవ్వలేదని పేర్కొన్నారు. మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా మారుస్తున్నామని హామీ ఇచ్చినప్పటికీ జిఓ ఇవ్వలేదని తెలిపారు. ఫేస్‌ యాప్‌ రద్దు, సంక్షేమ పథకాల అమలుపైనా ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదని పేర్కొన్నారు. అంగన్‌వాడీ ప్రధాన డిమాండ్ల కోసం ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వేతనాల పెంపు ప్రకటన చేయాలని కోరారు.

Also Read : సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు

లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె సబ్బరావమ్మ, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి జె లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ప్రధాన కార్యదర్శి విఆర్‌ జ్యోతిలు హెచ్చరించారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube