అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 25 వనపర్తి : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) అనుబంధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడి డిపిఓకి గురువారం వినతిపత్రం అందజేయడం జరిగింది. ఐసిడిఎస్ సీనియర్ అసిస్టెంట్ రమాదేవి వినతిపత్రాన్ని తీసుకోవడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఐసి డిఎస్ ను యధావిధిగా కొనసాగించాలి, పెంచిన పిఆర్సి చెల్లించాలి, ఇతర సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిరసనలు చేసినందుకు జీతం కట్ చేస్తే అప్రజాస్వామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి సూపర్ వైజర్ ఎగ్జామ్ తేదీని వెంటనే ప్రకటించాలి 2018 అక్టోబర్ నుండి కేంద్రం పెంచిన వేతనాలను చెల్లించాలని మినీ అంగన్వాడీ వర్కర్ లను మెయిల్ టీచర్స్ గా గుర్తించాలి.

ఈ కేంద్రాలకు హెల్పర్స్ ను నియమించాలి .ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి ఈరోజు అంగన్వాడి టీచర్ శ్రీలత ఘనపూర్ లో చనిపోవడం జరిగింది. వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి భీమా సౌకర్యం కల్పించాలి రోడ్డుపైన సరుకులు వేసే కార్గో విధానాన్ని వెనక్కి తీసుకోవాలి అంగన్వాడీ కేంద్రాల వద్ద అప్లై చేయాలి రేషన్ షాప్ కి ట్రాన్స్ఫర్ డబ్బులు చెల్లించాలి వెంటనే చెల్లించాలి తదితర 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షులు జ్యోతి పద్మ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

A petition was handed over to the Anganwadi DPO on Thursday under the auspices of the Telangana Anganwadi Teachers.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube