అంగన్వాడీ పనితీరు మెరుగుపరచాలి…

0
TMedia (Telugu News) :

మహబూబాబాద్,అక్టోబర్,26.

అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలోపర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయం ప్రగతి సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు కేంద్రానికి వచ్చిన పిల్లలు, గర్భిణీ మహిళలల వివరాలు ప్రతి రోజు ఫొటోలతో నివేదిక సమర్పించాలన్నారు.

జిల్లాలోని 1437 అంగన్వాడీ కేంద్రాలలో 1285 ప్రధాన, 152 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని త్వరలో సిబ్బంది నియామకం చేపడతామన్నారు.

జిల్లాలో 53 సెక్టార్ ల పరిధిలో ఉన్న అంగన్ వాడి కేంద్రాలను సూపర్ వైజర్లు సందర్శించి పనితీరుపై నివేదిక ఇవ్వాలన్నారు.
ఉదయం 9గంటలకు అంగన్ వాడి కేంద్రం తెరవాలన్నారు.
ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

అంగన్ వాడిలో విద్యుత్, త్రాగునీటి మరమ్మత్తులు సమస్యలు ఉంటే సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించు కోవాలన్నారు.

పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube