వంట వార్పు నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు

- గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ఇవ్వాలి

0
TMedia (Telugu News) :

వంట వార్పు నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు

– గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ఇవ్వాలి

టీ మీడియా, డిసెంబర్ 19,మహానంది : గౌరవ వేతనం వద్దు కనీస వేతనం రూ.26,000 వేల రూపాయలు ఇవ్వాలని జిల్లా అంగన్వాడీ నాయకురాలు నిర్మల అన్నారు. మంగళవారం మహానందిలోని తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడి కార్యకర్తలు సి.ఐ. టి . యూ ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజు వంట వార్పు కార్యక్రమం ద్వారా నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా అంగన్వాడి నాయకురాలు నిర్మల మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని,రాష్ట్రప్రభుత్వం నిరంకుశంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ, అంగన్వాడి సెంటర్ల తాళాలు పాలుగొట్టడం అన్యాయమని, రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని అన్నారు. గౌరవ వేతనం వద్దు, కనీసవేతనం 26 వేలు ఇవ్వాలని, టీఎలు, డిఏలు ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, కనీస వసతులు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే మా సమస్యలను పరిష్కారం చేసేంతవరకు నిరవధిక సమ్మెలో కొనసాగుతామని అన్నారు.

Also Read : హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరించాలంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సావిత్రి, లక్ష్మీనారాయణమ్మ, ఖైరున్, గౌరీ, కొండమ్మ,చండీ దేవి, మహేశ్వరి, పుష్పకళ తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube